హైదరాబాద్ లో సుమధుర ప్రాజెక్ట్స్ ప్రారంభం

24-10-2019

హైదరాబాద్ లో సుమధుర ప్రాజెక్ట్స్ ప్రారంభం

బెంగళూరుకు చెందిన సుమధుర కంపెనీ హైదరాబాద్‌లో కూడా వెంచర్లను చేపట్టింది. తాజాగా  భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని చేతుల మీదుగా కొండాపూర్‌లో సుమధుర హారిజాన్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. కుటుంబ సభ్యులందరూ కలిసి హాయిగా గడిపేలా హారిజాన్‌ను ఆధునిక రీతిలో ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు  సుమధుర ప్రాజెక్ట్స్‌ ఛైర్మన్‌ జి.మధుసూదన్‌ తెలిపారు. హైదరాబాద్‌ రియల్‌ మార్కెట్‌ ఎప్పుడూ గణనీయంగా అభివద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో ఇక్కడ తమ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 1995 నుంచి 2004 వరకూ హైదరాబాద్‌లో 30 అపార్టుమెంట్లను నిర్మించాం. ఆతర్వాత బెంగళూరుకు వెళ్లి 17 ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేశాం. ప్రస్తుతం అక్కడే చేపడుతున్న నాలుగు నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, మరో ఐదు నిర్మాణాల్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ హైదరాబాద్‌లో తమ వెంచర్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. 2015లో నానక్‌రాంగూడలో స్థలం కొనుగోలు చేసి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టును కట్టాం. ప్రస్తుతం కొండాపూర్‌లో 9.5 లక్షల చదరపు అడుగుల్లో హారిజాన్‌ ప్రాజెక్టును అభివద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు.

లగ్జరీ తరహా జీవనాన్ని కోరుకునేవారికి ఈ ప్రాజెక్టు చక్కగా నప్పే విధంగా నాలుగు టవర్లను డిజైన్‌ చేశారు. ఇందులో నివసించేవారికి జీవనమెంతో సాఫీగా సాగేందుకు 2, 3 పడక గదుల ఫ్లాట్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నారు.. నిర్మాణం వచ్చేది కేవలం 28 శాతం స్థలంలోనే. క్లబ్‌హౌజును అత్యాధునికంగా డిజైన్‌ చేస్తున్నారు. ఇతర వివరాలకోసం కంపెనీ వెబ్‌సైట్‌ను చూడండి.

www.sumadhuragroup.com