చట్టం ముందు అందరూ సమానమే : జగన్‌

21-10-2019

చట్టం ముందు అందరూ సమానమే : జగన్‌

చట్టం అందరికీ ఒకటే.. కొందరి చుట్టం కాకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. వియజవాడలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగన్‌ మాట్లాడుతూ దేశంలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ప్రకటించిన రాష్ట్రం మనదేన్నారు. అమరపోలీసులకు సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. మన రాష్ట్ర భద్రత కోసం అనేక సందర్భాలలో మహానుభావులు ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. పోలీస్‌ టోపీ మీద ఉన్న సింహాలు దేశ సార్వభౌమాదికారాలకు నిదర్శనమని అన్నారు.

లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో ఎంతిటివారికైనా మినహాయింపు ఉండకూడదు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగే ఎంతటివారినైన చట్టం ముందు నిలబెట్టమని గతంలో చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కో రూల్‌ ఉండకూదు. పోలీసులు ప్రజల మన్ననలు పొందినప్పుడే వారానికి ఒక్కరోజు సెలవులు లేవన్న విషయం నాకు తెలుసు. హోంగార్డుల జీతాలు రూ.21 వేలకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. విధి నిర్వహణలో పోలీసులు మరణిస్తే 40 లక్షల ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ సదుపాయాన్ని తీసుకొచ్చాం. విధి నిర్వహణలో మంచి పేరు తెప్పించుకోండి అని వైఎస్‌ జగన్‌ తెలిపారు