26 కేసులు వేశారు... ఏం సాధించారు?

21-10-2019

26 కేసులు వేశారు... ఏం సాధించారు?

నేను తప్పు చేయలేదు.. ఎవరికీ భయపడను అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కార్యకర్తల త్యాగాలు మరిచిపోలేనని.. కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణం పణంగా పెడతానన్నారు. నేను తప్పు చేయలేదు.. భయపడను. జగన్‌ తండ్రి 26 కేసులు వేశారు.. ఏం సాధించారు? తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తాం. గ్రామ స్థాయి నుంచి సమర్ధవంతమైన నాయకత్వం రావాలి. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారు దేశభక్తులయ్యారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రజల ఆశీస్సులు పొందండి. పార్టీలో యువతకు 33 శాతం పదవులు ఇస్తాం. మహిళలకు 33 శాతం కేటాయిస్తాం. ప్రజల కోసం నిరంతరం ఆలోచించాను. కార్యకర్తలతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. కార్యకర్తలతో సమన్వయం చేసుకునివుంటే మెరుగైన ఫలితాలు వచ్చేవి. పోలీసులు జగన్‌ సర్కార్‌ శాశ్వతం కాదని గ్రహించాలి. మైనింగ్‌ మాఫియాకు గనులు ఇచ్చిన వ్యక్తి జగన్‌కు సలహాదారుడుగా ఉన్నారు అని అన్నారు.