డొనాల్డ్‌ ట్రంప్‌కు మోదీ సూచన

12-10-2019

డొనాల్డ్‌ ట్రంప్‌కు మోదీ సూచన

కాశ్మీర్‌ భారత్‌ అంతర్గ వ్యవహారమని, అందులో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రధాని మోదీ సూచించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వెల్లడించారు. బల్దానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ కాశ్మీర్‌లో ఎవరి జోక్యాన్ని అంగీకరించకపోవడం కొన్నేళ్ళుగా మేము అనుసరిస్తున్న వైఖరి. కాశ్మీర్‌పై ఏదేశమైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది మా అంతర్గత వ్యవహారమని చెబుతాం. అది అమెరికా అధ్యక్షుడు కావచ్చు మరెవరైనా కావచ్చు. కాశ్మీర్‌ మా అంతర్గత వ్యవహారమని, ఇతరులు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని ప్రధాని మోడీ సృష్టంగా చెప్పారు అని షా అన్నారు.