ప్రధాని మోదీతో వైఎస్‌ జగన్‌ భేటీ

05-10-2019

ప్రధాని మోదీతో వైఎస్‌ జగన్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. రైతు భరోసా ప్రారంభోత్సవానికి రావాలని మోదీని జగన్‌ ఆహ్వానించారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదా అయిన నిధుల వివరాలను మోదీకి జగన్‌ తెలియజేశారు. పోలవరం త్వరగా పూర్తయ్యేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి అవసరమైన నిధులు ఇవ్వాలని, విశాఖ- కాకినాడ పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటుకు సహకారం అందించాలని మోదీకి జగన్‌ వినతిప్రతం ఇచ్చారు.