ఆర్టీసీ ఉద్యోగులకు హెచ్చరిక

05-10-2019

ఆర్టీసీ ఉద్యోగులకు  హెచ్చరిక

ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ హెచ్చరించారు. సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కారని, భవిష్యత్తులో కూడా వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీపై ప్రత్యామ్నాయ విధానం ఖారారుకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పరిశీలనలో మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. 3 నుంచి 4 వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం...ఆర్టీసి బస్సులు నడపడానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతామని, వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి బస్సులను యధావిధిగా నడపుతామని చెప్పారు. 6 నుంచి 7 వేల ప్రైవేటు బస్సులకు రూట్‌ పర్మిట్లు ఇస్తామని తెలిపారు.