వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

05-10-2019

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

ప్రభుత్వం విధించే డెడ్‌లైన్ల్‌కు కార్మికులు బెదరబోరని తెలంగాణ ఆర్టీసీ ఐకాస నేతలు సృష్టం చేశారున. సమ్మె విషయంలో వెనక్కి తగ్గబోమని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డితో పాటు పలువురు నేతలు ఎంజీబీఎస్‌ను సందర్శించారు. సమ్మె జరుగుతున్న తీరును పరిశీలించారు. కార్మికులంతా సమ్మెలో పాల్గొంటూ దిగ్విజయం చేస్తున్నారని వారు అన్నారు. ఇకనైనా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్‌ ఎదుట ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెతో కార్మికులు నైతిక విజయం సాధించారని ఈ సందర్భంగా ఐకాస నేతలు పేర్కొన్నారు.