అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా?

05-10-2019

అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా?

నిజాయితీగా ఉన్న మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. న్యాయం కోసం మహిళా అధికారి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కేసు తీసుకోవడానికే జంకారంటే పోలీసింగ్‌ ఉన్నటా? లేనట్టా? అని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళా అధికారులని కూడా చూడరా? ఆ అధికారి ఇంటికి కరెంట్‌ నీటి కనెక్షన్‌ను కట్‌ చేస్తారా అని మండిపడ్డారు. అసలు రాష్ట్రలో ప్రభుత్వం ఉందా? ఉంటే సీఎంకు ఇవేమీ కనపడవా? అని సూటీగా ప్రశ్నించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జర్నలిస్టును చంపుతానని ఫోన్లో బెదిరించాడని, మహిళా డాక్టర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారని అన్నారు. అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని అన్నారు.