టీటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకారం

23-09-2019

టీటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల నూతన మండలి కొలువుదీరింది. తిరుమల శ్రీవారి ఆలయం గరుడాళ్వార్‌ సన్నిధిలో 50వ ధర్మకర్తల మండలి సభ్యులుగా 20 మంది ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ జేఈవో బసంత్‌కుమార్‌ వారితో ప్రమాణం చేయించారు. టీటీడీ నూతన పాలక మండలిలో 29 సభ్యులతో పాటు ఏడుగురికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్‌ ఆపిషియో సభ్యులుగా దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోమోహన్‌సింగ్‌, కమిషనర్‌ పద్మ, ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రమాణం చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన సభ్యులకు రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలను అందజేసి సత్కరించారు.