తల్లి ఆశ్వీరాదం తీసుకున్న ప్రధాని మోదీ

17-09-2019

తల్లి ఆశ్వీరాదం తీసుకున్న ప్రధాని మోదీ

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిరూపించారు. ఆయన 69వ జన్మదినోత్సవాల సందర్భంగా తన స్వరాష్ట్రం గుజరాత్‌లో గడిపారు. ఈ సందర్భంగా సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు వెళ్లిన ప్రధాని తన తల్లి హీరాబెన్‌ను కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు. 98ఏళ్ల హీరాబెన్‌ తన చిన్న కుమారుడు పంకజ్‌ మోదీతో కలిసి గాంధీనగర్‌ సమీపంలోని రైసిన్‌ గ్రామంలో నివసిస్తున్నారు. అక్కడకు వెళ్లిన ప్రధాని మోదీ తల్లితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆమె పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఆయనకు బహుమతిగా రూ.501 ఇచ్చారు. ఇరుగుపొరుగు వారితో కాసేపు సరదాగా గడిపారు.