ఆ రెండు వైసీపీకి లొంగిపోయాయి : చంద్రబాబు

17-09-2019

ఆ రెండు వైసీపీకి లొంగిపోయాయి  : చంద్రబాబు

ఇంకా ఎంతమందిని వైసీపీ ప్రభుత్వం పొట్టనపెట్టుకుంటుంది? ఎన్ని కేసులు పెడతారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం, ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ మొత్తం వైసీపీ ప్రభుత్వానికి లొంగిపోయిందని విమర్శించారు. ఎందుకు లొంగిపోయిందో తనకు అర్థం కాలేదన్నారు. తాను 14 ఏళ్లు సీఎంగా పని చేశానన్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ఒకరిద్దరూ అటో ఇటుగా ఉంటారని, వ్యవస్థ ఎప్పుడూ సరెండర్‌ కాదని ఆయన అన్నారు. అది రాష్ట్రానికి అరిష్టమని, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని పేర్కొన్నారు. కొంతమంది అధికారులకు నాలుగు నెలలుగా ప్రభుత్వం పొస్టింగ్‌ ఇవ్వలేదని, వాళ్లు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. జగన్‌ తన ఇష్టప్రకారం పరిపాలించడానికి ప్రజలు అధికారం ఇవ్వలేదని అన్నారు.