పూర్ణ నేటితరానికి ఆదర్శం : అమెరికా కాన్సులేట్‌

26-07-2019

పూర్ణ నేటితరానికి ఆదర్శం : అమెరికా కాన్సులేట్‌

ప్రపంచంలోని ప్రఖ్యాత శిఖరాలను అధిరోహించిన మాలావత్‌ పూర్ణ నేటితరానికి ఆదర్శనీయమని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ క్యాథరిన్‌ హడ్డా చెప్పారు. పూర్ణకు పర్వతారోహణపై శిక్షణ ఇచ్చినవారు, ప్రభుత్వం, గురుకులాల అధికారులను కూడా ఈ సందర్భంగా అభినందించాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివేందుకు మారుమూల పల్లె నుంచి ప్రతిష్ఠాత్మక పర్వతాలను అధిరోహించిన పూర్ణ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. చిన్న వయసులోనే పర్వతారోహణ చేపట్టి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన మాలావత్‌ పూర్ణ జీవిత కథ ఆధారంగా తోట అపర్ణ రాసిన పూర్ణ ది యంగెస్ట్‌ గర్ల్‌ ఇన్‌ ది వరల్డ్‌ టు స్కేల్‌ మౌంట్‌ ఎవరెస్ట్‌ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆమె ఆవిష్కరించారు. చిన్న వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణపై పుస్తకం వెలువడటం అభినందనీయమని, చాలామంది విద్యార్థులకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని క్యాథరిన్‌ హడ్డా పేర్కొన్నారు.