ఎవరు అడిగారని కొత్త నిర్మాణాలు ?

26-07-2019

ఎవరు అడిగారని కొత్త నిర్మాణాలు ?

ఎవరు అడిగారని కొత్త సెక్రటేరియట్‌, కొత్త అసెంబ్లీ నిర్మాణం చేస్తున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్ర ఉండకూడదని కేసీఆర్‌ ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా కొత్త సెక్రటేరియట్‌ వద్దని నిరసన చేపట్టాలని కోరారు. సంక్షేమ పథకాలు కూడా పైసలు లేవని ముందు వాటికి డబ్బులు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.