సీఎం కేసీఆర్‌కు ఆయనే టార్గెట్‌ : డీకే అరుణ

25-07-2019

సీఎం కేసీఆర్‌కు ఆయనే టార్గెట్‌ : డీకే అరుణ

భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీలో మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. కార్యకర్తల ఒత్తిడితోనే సునీతా లక్ష్మారెడ్డి బీజేపీలోకి రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్‌కు హరీష్‌రావే టార్గెట్‌ అని అన్నారు. హరీశ్‌ను దెబ్బ తీయాలనే చింతమడకకు కేసీఆర్‌ వరాలు ప్రకటించారని పేర్కొన్నారు. జూపల్లి కృష్ణారావు ఎక్కడివెళ్లినా జరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల భూములున్న చోటే ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లు కేసీఆర్‌ ప్రవర్తన ఉందని విమర్శించారు.