ఏపీ నూతన గవర్నర్‌కు ఘనస్వాగతం

24-07-2019

ఏపీ నూతన గవర్నర్‌కు ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆయన సతీమణి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ దంపతులకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎయిర్‌పోర్టు నుంచి దుర్గాదేవి దర్శనం కోసం గవర్నర్‌ విజయవాడకు వెళ్లగా ముఖ్యమంత్రి జగన్‌ క్యాంప్‌ కార్యాలయానికి పయనమయ్యారు.