Asian Infrastructure Investment Bank withdraws funding to Amaravati project

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ మరో కీలక బ్యాంకు తేల్చి చెప్పింది. అమరావతి అభివృద్ధికి రుణసాయం చేయలేమని ప్రపంచ బ్యాంక్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన మరువకముందే మరో కీలక బ్యాంక్‌ అయిన ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌( ఏఐబబీ) అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ సృష్టం చేసింది. ఈ మేరకు ప్రకనట విడుదల చేసింది. బ్యాంకులు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతుండటంతో రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభావం పడుతోంది.

అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. అయితే అమరావతిపై ఏపీ ప్రభుత్వ వైఖరి చూశాక రుణం ఇవ్వకపోవడమే మంచిదని ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రపంచ బ్యాంకు రుణ ప్రాతిపాదనను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఏఐఐబీ కూడా రుణసాయంపై వెనక్కి తగ్గడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.