ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇవ్వాలి

23-07-2019

ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇవ్వాలి

కశ్మీర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని మోదీ పార్లమెంట్‌లో సమాధానం ఇవ్వాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ డిమాండ్‌ చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ సమక్షంలో ట్రంప్‌ కశ్మీర్‌పై మాట్లాడడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కశ్మీర్‌ సమస్యపై ట్రంప్‌ మధ్యవర్తిత్వాన్ని కోరడం అంటే ఇది ఇండియా ఐక్యశక్తికి పెద్ద విఘాతమే అని తివారీ అన్నారు. మోదీనే ఆహ్వానం కోరినట్లు ట్రంప్‌ తెలిపారని తివారీ గుర్తు చేశారు. ప్రధాని మోదీ సభకు వచ్చి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఒకవేళ నిజంగానే ఇద్దరి మధ్య ఎటువంటి చర్చ జరగని పక్షంలో కశ్మీర్‌పై అమెరికా తప్పుడు ప్రకటనలు చేస్తుందని ప్రధాని చెప్పాలన్నారు.