అక్టోబర్‌ 22న బీసీసీఐ ఎన్నికలు

21-05-2019

అక్టోబర్‌ 22న బీసీసీఐ ఎన్నికలు

బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ (బీసీసీఐ) సంఘానికి ఎన్నికలు అక్టోబర్‌ 22న జరగనున్నాయి. కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీఓఏ) ఈ విషయాన్ని తెలియజేశారు. గత రెండు ఏళ్ల నుంచి సీఓఏ ఆధ్వర్యంలోనే క్రికెట్‌ బోర్డు నిర్వహణ జరుగుతున్నది. సుప్రీం కోర్టు సీఓఏను నియమించిన విషయం తెలిసిందే. దానికి ప్రస్తుతం వినోద్‌ రాయ్‌ చీఫ్‌గా ఉన్నారు. డయానా, ఎడుల్‌జీ, లెఫ్టినెంట్‌ జనరల్‌ రవి తోగ్డేలు సభ్యులుగా ఉన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సభ్యులతో బీసీసీఐ బోర్డు నిర్వహణ జరుగుతుందన్న నమ్మకాన్ని పీఎస్‌ నర్సింహా కమిటీ వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత నర్సింహా తన రిపోర్ట్‌ను సమర్పించారు.