
కోల్కతాలో బీజేపీ దాడులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమన్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి వ్యవస్థల ద్వారా.. బెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్షా చేస్తోన్న విధ్వంసక వ్యూహాలను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సంఘీభావం తెలుపుతూ అమిత్ షా చర్యలను ఖండిస్తున్నట్టు ట్విటర్లో పేర్కొన్నారు.