23న తెలుగోడి బలమేంటో తెలుస్తుంది

15-05-2019

23న తెలుగోడి బలమేంటో తెలుస్తుంది

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌పై సాగించిన కక్షపూరిత వ్యవహారాలను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని టీడీపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ అన్నారు. దేశంలోని ప్రజలెవరూ మోదీ నాయకత్వాన్ని కోరుకోవడంలేదని, ఈ నెల 23న ఎన్నికల ఫలితాల రూపంలో ఈ విషయం తేటతెల్లమవుతుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీయే కదా అని టీడీపీని తక్కువ అంచనా వేశారని, తెలుగువారి బలమేంటో త్వరలోనే తెలుసుకుంటారని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. ఏ వర్గం వారిని చూసినా మోదీలాంటి హిట్లర్‌ మాకు వద్దే వద్దు అంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ చేసిన రాజకీయ డ్రామాలు, పన్నిన కుతంత్రాలు, ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు, ఏపీ ప్రజలపై చూపిన కక్షను ఎవరూ మరచిపోలేదని ఆమె వ్యాఖ్యానించారు.