రూ.2999లకే బ్యాంకాక్, కౌలాలంపూర్ కు విమానయానం

15-05-2019

రూ.2999లకే బ్యాంకాక్, కౌలాలంపూర్ కు విమానయానం

విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ వెళ్లే విమాన ప్రయాణికుల కోసం ఎయిర్‌ ఏషియా విమానయాన సంస్థ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. విశాఖ నుంచి రూ.2999లకే ఆయా ప్రాంతాలకు వెళ్లవచ్చని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టికెట్ల విక్రయాలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు. అదే రోజు నుంచి 31:10:19 మధ్య ప్రయాణ తేదీలు అందుబాటులో ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు ఏయిర్‌ ఏషియా వెబ్‌సైట్‌లో చూడొచ్చని చెప్పారు.