టీడీపీ మహానాడు వాయిదా

15-05-2019

టీడీపీ మహానాడు వాయిదా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఏటా మే 27 నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించే పార్టీ మహానాడుని ఈసారి వాయిదా వేయాలని తెలుగుదేశం నాయకత్వం నిర్ణయించింది. దీనికి బదులుగా ఎన్టీఆర్‌ జయంతిని గ్రామగ్రామన ఘనంగా నిర్వహించాలని సంకల్పించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం మొదలవడానికి ముందుగా మంత్రులతో విందు సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ అధికార ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మహానాడు నిర్వహణ, కేంద్రంలో రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉండటం,  ఏర్పాట్లకు తగిన సమయం లేకపోవటంతో మహానాడుని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.