చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని మోకాళ్లపై తిరుమలకు

15-05-2019

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని మోకాళ్లపై తిరుమలకు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును చూడాలన్న ఆంకాక్షతో,  కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామానికి చెందిన చల్లా కొండ, మేకల శ్రీనివాసరావులు తిరుమల కొండను అలిపిరి నుంచి మోకాళ్లపై ఎక్కారు. వీరు ఇరువురు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలో కలిసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి తమ యాత్ర విశేషాలను వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా శాంతి, భద్రతల పరిరక్షణ మీతోనే సాధ్యమవుతుందని చంద్రబాబుకు కొండ, శ్రీనివాసరావులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి ఇరువురిని అభినందించారు.