ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో అశాంతి

23-04-2019

ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో అశాంతి

ప్రధాని మోదీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో శాంతి ఉండదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. ఈ  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ముందు తాను లేవనెత్తిన ప్రశ్నలకు బదులివ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తొలి విడత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం ఈవీఎంలు ఒకేసారి ఎందుకు ఆగిపోయాయో తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.