ఆ లెక్కలు తెలుసుకునేందుకే స్విట్జర్లాండ్ కు?

23-04-2019

ఆ లెక్కలు తెలుసుకునేందుకే స్విట్జర్లాండ్ కు?

ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.8వేల కోట్లు ఖర్చు చేసిందని, ఆ లెక్కలన్నీ తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లారని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ వ్యూహకర్తగా జగన్‌ నుంచి రూ.300 కోట్లు తీసుకున్న ప్రశాంత్‌ కిషోర్‌.. చివరికి ముఖ్యమంత్రి అనే పేరున్న బోర్డు మాత్రమే తయారు చేయించగలిగారని ఎద్దేవా చేశారు. బీజేపీకీ జీవీఎల్‌ నరసింహారావు, వైకాపాకు విజయసాయిరెడ్డి, సి.రామచంద్రయ్య శకునిలా తయారయ్యారని విమర్శించారు.