ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

20-04-2019

ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 69న జన్మదిన వేడులు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేదపండితులు చంద్రబాబుకు మంగళాశీర్వచనాలు పలికారు. 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం గుంటూరులో మంత్రి ఆనంద్‌ బాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్సీ జీవీ ఆంజనేయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట పట్టణంలోని సీబీఎన్‌ ఆర్మీ, టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కేక్‌ కట్‌ చేసి శ్రేణులకు పంచారు.

Click here for Photogallery