సీఎం చంద్రబాబుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు

20-04-2019

సీఎం చంద్రబాబుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. చంద్రబాబుకు గవర్నర్‌ ఫోన్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రతిపక్ష నేత జగన్‌ కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కేక్‌ కట్‌ చేసి ఆనందంగా జరుపుకుంటున్నారు.