ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 69వ జన్మదిన శుభాకాంక్షలు...

20-04-2019

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 69వ జన్మదిన శుభాకాంక్షలు...

ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పుట్టినరోజు వేడుకలు జరిగినా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులకు పెద్దపండుగ, తెదేపా నేతలు, అభిమానుల సంతోషాలకు అవధులు లేవు...ప్రతి ఒక్కరూ ఉడతాభక్తిగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఫలమో, ధనమో అభాగ్యులకు, అన్నార్తులకు కానుకగా ఇచ్చి మానవతాదృక్పధాన్ని చాటారు... నేటి సాయంత్రం తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన బ్లండ్ బ్యాంకును ప్రారంభించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సేవాతత్పరతను చాటుకోనున్నారు.

ప్రస్తుత స్థితిలో చంద్రబాబు నాయుడు వంటి మహానాయకుల సేవలు ఏపీకే కాకుండా, దేశానికి కూడా ఎంతో అవసరం -భవిష్యత్‌లో చంద్రబాబు దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు... సీఎం పని తీరు గుర్తించిన ప్రజలు ఏపీలో మరోసారి టీడీపీకే కట్టనున్నారు- 140 సీట్లలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు విజయకేతనం ఎగురవేయనున్నారు...మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరనుంది...కేంద్రంలో కూడా బీజేపీయేతర కూటమే అధికారంలోకి వస్తుంది.
మరో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు...నవ్యాంధ్ర ప్రజల కల నెరవేరుస్తారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు వందేళ్లు ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకుంటూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ - ఐదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల వారిని ఆదుకున్నారు -మరో ఐదేళ్లు చంద్రబాబు నాయుడు సీఎంగా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారని విశ్వసించవచ్చు. చంద్రబాబుగారు... సమాజసేవలో మరెన్నో సంవత్సరాలు గడపాలని 5 కోట్ల ఆంధ్రుల ఆశ, ఆకాంక్ష.

Click here for Event Gallery