కాంగ్రెస్ కు ఓటేస్తే కారుకు

12-04-2019

కాంగ్రెస్ కు ఓటేస్తే కారుకు

నల్గొండ పబ్లిక్‌ స్కూల్‌లో భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 10 పోలింగ్‌ కేంద్రాల్లో ఎవరికి ఓటు వేసినా వీవీప్యాట్‌ స్లిప్పుల్లో కారు గుర్తే కనిపిస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. సంబంధిత ప్రాంతాల్లో పోలింగ్‌ నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే  ఒక పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను మార్చినట్లు అధికారులు తెలిపారు.