ఈ ఉద్యోగాలు చాలా కఠినం... మహిళలకు ఇవ్వలేం

11-01-2019

ఈ ఉద్యోగాలు చాలా కఠినం... మహిళలకు ఇవ్వలేం

భవిష్యత్‌లో కొన్ని రైల్వే ఉద్యోగాలకు మహిళలు దరఖాస్తు చేసే పరిస్థితి లేకుండా పోనుంది. రైల్వే డ్రైవర్లు, పోర్టర్లు, రైల్వే గార్డులు, గ్యాంగ్‌ మెన్‌ లాంటి ఉద్యోగాల్లో మహిళలను నియమించలేమని రైల్వే బోర్డు సృష్టం చేసింది. రైల్వేలో ఈ ఉద్యోగాలన్నీ చాలా కఠినమైనవని, వీటిలో భద్ర దృష్ట్యా మహిళలను నియమించలేమని రైల్వేబోర్డు పేర్కొంది. రైల్వే ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలని వినతిపత్రాలు వచ్చిన నేపథ్యంలో డ్రైవర్లు, గార్డులు, ట్రాక్‌ మెన్‌, రన్నింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు చాలా కఠినమైనవని అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలని అందుకే వీటిలో మహిళలను నిమయించలేమని రైల్వే బోర్డు పేర్కొంది. భారతీయ రైల్వేలో 1.3 మిలియన్ల మంది ఉద్యోగులుండగా వీటిలో డెస్క్‌ ఉద్యోగాల్లో కేవలం 2 నుంచి 3 శాతం మంది మాత్రమే మహిళలని రైల్వేశాఖ తెలిపింది. డ్రైవర్లు రైళ్లు నడపాలని, గార్డులు సిగ్నల్‌ ఇచ్చేందుకు చివరి బోగీలో ఉంటారని, పోర్టర్లు బరువులు మోయాలని అందుకే ఈ ఉద్యోగాల్లో మహిళలు తగరని పేర్కొంది.