ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేం...కానీ గెలుపు మాదే

05-12-2018

ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేం...కానీ గెలుపు మాదే

ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని నియమిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సృష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. మహాకూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేమని, కానీ గెలుపు తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.  కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువత ఆశల్ని నీరుగార్చిందని, ప్రజలు కేసీఆర్‌పై ఉంచి విశ్వాసాన్ని వమ్ము చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల కలలు సాకారమవుతాయని అనుకున్నామని, కానీ కేసీఆర్‌ పాలన అందుకు విరుద్ధంగా సాగిందని ఆరోపించారు. రైతులకు అందుబాటులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కూటమికి పట్టం కట్టాలని కోరారు.