క్రెడాయ్ ప్రాపర్టీషోను ప్రారంభించిన స్పీకర్ కోడెల

04-01-2019

క్రెడాయ్ ప్రాపర్టీషోను ప్రారంభించిన స్పీకర్ కోడెల

ఆర్థిక ఇబ్బందులున్నా అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండడం తమ అదృష్టమని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. విజయవాడలో క్రెడాయ్‌ ప్రాపర్టీషోను స్పీకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. చంద్రబాబు లాంటి విజన్‌ ఉన్న నాయకుడు మళ్ళీ రావాలని స్పీకర్‌ ఆకాంక్షించారు. ఏపీకి వ్యాపార రాజధాని విజయవాడ అని పేర్కొన్నారు. చుక్క భూముల సమస్య పరిష్కారిస్తామన్నారు. బిల్డర్లకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని, బ్యాంకర్లు రుణాల విషయంలో పారదర్శకంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, బోండా ఉమా పాల్గొన్నారు.

Click here for Event Gallery