తెలంగాణలో పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం

23-12-2018

తెలంగాణలో పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం

తెలంగాణలో మరోసారి రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంది. పారిశ్రామిక పురోభివద్ధితో పాటు రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా గణనీయమైన వద్ధిని సాధిస్తోంది. అంతర్జాతీయ ఐటి సంస్థలు హైదరాబాద్‌కు తరలిరావడం, ఇప్పటికే ఏర్పాటైన సంస్థలు విస్తరణ చేపట్టడంతో ఆఫీస్‌ స్పేస్‌కు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. గత రెండేళ్ళలో పది లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ వచ్చిందని, భవిష్యత్తులో మరింత పెరుగుతుందని రియల్‌ రంగం నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

రాష్ట్రంలో వద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరిగిన జీడీపీతో వద్ధి మరింత వేగవంతమైంది. ఈ రంగం కోలుకోవడానికి ఖచ్చితంగా రెరా లాంటి విధానాలు కారణమవుతున్నాయి. కొనుగోలుదారులలో నమ్మకాన్ని కలిగించడంతో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మెరుగైన ఫలితాలను కనబరుస్తోంది. మౌలిక వసతులు, అభివద్ధి కార్యక్రమాలు రియల్‌ పరుగుకు ప్రధానపాత్రను పోషిస్తున్నాయి.. నగరంలో రెసిడెన్షియల్‌ యూ నిట్ల అమ్మకాలలో 30 శాతం వద్ధి సాధించింది.  హైదరాబాద్‌కు వలస వచ్చేవారి సంఖ్య పెరగడం, నగర మౌలిక వసతుల కల్పన, కనెక్టివిటీపై రాష్ట్ర ప్రభు త్వం భారీగా పెట్టుబడులు పెట్టడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం పురోగతి సాధిం చడం తోపాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.

ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడం, గహ రంగానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోదా రావడంతో ఈ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. 2019లో మొత్తం రంగానికి ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ హోదా వస్తే, అతి తక్కువ వడ్డీరేట్లకు నగదు లభ్యత మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. తద్వారా గహ కొనుగొలుదారులకు ప్రాజెక్టులు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ 2019లో జిఎస్‌ టి రేట్లను 12 నుంచి 6 శాతానికి తగ్గించడం గానీ, ప్రస్తుత జిఎస్‌టి రేట్లతో స్టాంప్‌ డ్యూటీ రేట్లను సవరించాలని రియల్‌ ఎస్టేట్‌ రంగం వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రేట్లు తగ్గిస్తే విని యాగదారులకు ప్రయోజనం చేకూరడంతో పాటు అమ్మకాలు భారీగా పెరిగితే ఉపాధి అవకాశాలకు మరింత వెసులుబాటు కలుగు తుందని భావిస్తున్నారు. మౌలిక వసతులపై అధికంగా దష్టి కేంద్రీకరించడంవల్ల దీరెకాలంలో స్థిరంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివద్ధికి మద్దతు అందించడంలోమ మధ్యతరహా ఆదాయం కలిగిన గహ వినియోగంలో కొనుగొలుదారులకు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టేందుకు తోడ్పడుతుంది. డెవలపర్లు, అప్రూవల్‌ అధికారులు అధిక స్థాయిలో పనుల విషయంలో జవాబుదారీగా ఉండటానికి రెరా దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. సింగిల్‌ విండో క్లియరెన్స్‌లతో ప్రాజెక్టు అనుమతులు మరింత వేగంగా వస్తా యని ఆశిస్తున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే రూ. 11వేల కోట్ల పెట్టుబడులు కలిగిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఆఫీస్‌ స్పేస్‌తో పాటు రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు కూడా ఉన్నా యి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశాలు పెరుగుతాయని క్రెడాయ్‌ ప్రతిని ధులు పేర్కొన్నారు.

రియల్‌ ఎస్టేట్‌కు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగం హోదా కల్పించాలని అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్‌ రావడంతో కేంద్ర ప్రభుత్వంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తేవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్స రంలో రూ. 1100 కోట్ల పెట్టుబడుల తో కొత్త ప్రా జెక్టులు ప్రారంభమవుతాయని భావి స్తున్నా రు. రాష్ట్రంలో అ న్ని రంగాలకన్నా రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగంగణనీయ అభివద్ధి సాధిస్తోందని, దేశంలోనే రియల్‌ రంగంలో తెలంగాణ అగ్రభాగాన ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.