నవంబరు 2 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో

25-10-2018

నవంబరు 2 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో

నవంబరు 2 నుంచి 4 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంతంలో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా) ప్రకటించింది. ఇలా ప్రాపర్టీ షోను నిర్వహించడం ఇది తొమ్మిదోసారని ట్రెడా ప్రెసిడెంట్‌ పీ రవీందర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రియల్‌ ఎస్టేట్‌ రంగం నిలకడైన వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, అలాగే పెట్టుబడులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నదని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుండటంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపడానికి ప్రధాన కారణమన్నారు.