బాటా - తానా క్రికెట్ కప్ 2018కు అనూహ్య స్పందన

04-10-2018

బాటా - తానా క్రికెట్ కప్ 2018కు అనూహ్య స్పందన

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ - ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కలిసి నిర్వహించిన బాటా - తానా కప్‌ టోర్నమెంట్‌ విజయవంతంగా ముగిసింది. ఎస్‌ఆర్‌సిఎ కూడా ఈ టోర్నమెంట్‌ నిర్వహణలో పాలుపంచుకుంది. కేరళ వరద బాధితుల సహాయార్థం నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో పలు టీమ్‌లు పాల్గొన్నాయి. వాతావరణం కూడా మంచిగా ఉండటంతో పోటీలు ఉత్సాహంగా జరిగాయి. దాదాపు 3 మైదానాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు ఈ పోటీలు జరిగాయి. రాంచో పార్క్‌లో ఫైనల్‌ పోటీలను ఫ్లడ్‌లైట్ల మధ్య నిర్వహించారు. టోర్నమెంట్‌ విన్నర్‌గా డిఫెన్స్‌ ప్లేయర్స్‌, రన్నర్స్‌గా కింగ్స్‌ నిలిచారు. 3వ ప్లేస్‌లో ఆల్‌ స్టార్స్‌ జట్టు వచ్చింది. ఎంవిపిగా పర్శు (డిఫెన్స్‌ ప్లేయర్స్‌), మ్యాన్‌ ఆఫ్‌ ది ఫైనల్స్‌ సుమిత్‌ (డిఫెన్స్‌ ప్లేయర్స్‌), మ్యాగ్జిమమ్‌ 6లు కొట్టిన ప్లేయర్‌గా రోనక్‌ (కింగ్స్‌) నిలిచారు. దాదాపు 11 సిక్స్‌లను ఇతను కొట్టాడు. బెస్ట్‌ బౌలర్‌గా స్టీవ్‌ (ఆల్‌ స్టార్స్‌) నిలిచారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఫైనల్స్‌ 1గా సుమిత్‌ (డిఫెన్స్‌ ప్లేయర్స్‌), ఎంఓఎం ఫైనల్స్‌ 2గా రాకేష్‌ బద్లాని (డిఫెన్స్‌ ప్లేయర్స్‌), ఎంఓఎం ఫైనల్స్‌ 3గా రోనక్‌ (కింగ్స్‌) నిలిచారు.

బాటా ప్రెసిడెంట్‌ యశ్వంత్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకోసం బాటా ఇలాంటి టోర్నమెంట్‌లను నిర్వహిస్తోందని చెప్పారు. వాలీబాల్‌, క్రికెట్‌ కప్‌, బ్యాడ్మింటన్‌ వంటి టోర్నమెంట్‌ల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందిస్తున్నామని కూడా తెలిపారు. బాటా కప్‌ ద్వారా శంకర ఐ ఫౌండేషన్‌కు 80కె అందజేశామని తెలిపారు. బాటా టీమ్‌ను కూడా ఆయన పరిచయం చేశారు. హరినాథ్‌ (వైస్‌ ప్రెసిడెంట్‌), సుమంత్‌ (సెక్రటరీ), కొండల్‌ (ట్రెజరర్‌), అరుణ్‌ (జాయింట్‌ సెక్రటరీ)ని ఆయన పరిచయం చేశారు. స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి, కామేష్‌, కళ్యాణ్‌, శిరీష, అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, రమేష్‌ కొండ, కరుణ్‌ వెలిగేటి, కల్చరల్‌ కమిటీ సభ్యులు శ్రీదేవి, శ్రీలు, దీప్తి, నామినేటెడ్‌ కమిటీ సభ్యులు ప్రశాంత్‌, హరి, వరుణ్‌ తదితరులు ఈ టోర్నమెంట్‌ విజయం పట్ల హర్షం వ్యక్తం?చేశారు.

తానా నాయకుడు సతీష్‌ వేమూరితోపాటు తానా సభ్యులు రజనీకాంత్‌, వినయ్‌ తదితరులు టోర్నమెంట్‌లో పాల్గొన్న టీమ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. శాన్‌రామన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఆర్‌సిఎ) కూడా ఈ టోర్నమెంట్‌కు వచ్చిన స్పందనపై సంతోషాన్ని వ్యక్తం?చేసింది. శాన్‌రామన్‌ మేయర్‌ బిల్‌ క్లార్క్‌సన్‌, శాన్‌రామన్‌ పార్క్స్‌ కమిషనర్‌ శ్రీధర్‌ వెరోస్‌, ఆపాపా బే ఏరియా ప్రెసిడెంట్‌ ఆండీ లి తదితర ప్రముఖులు ఈ టోర్నమెంట్‌కు వచ్చి నిర్వాహకులను అభినందించారు. ఈ టోర్నమెంట్‌ ద్వారా వచ్చిన నిధులను కేరళ వరద బాధితుల సహాయార్థం  బే ఏరియాలోని మలయాళీ అసోసియేషన్‌ ప్రతినిధి బీనా నాయర్‌కు అందజేశారు.

Click here for Event Gallery