వెంకటరమణ సేవలు ప్రశంసనీయం

23-07-2018

వెంకటరమణ సేవలు ప్రశంసనీయం

శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో కాన్సుల్‌గా ఉన్న వెంకటరమణ సేవలను ప్రశంసిస్తూ, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ, బే ఏరియాలోని మిల్‌పిటాస్‌లో ఉన్న స్వాగత్‌ రెస్టారెంట్‌లో ఓ కార్యక్రమాన్ని జూలై 22న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి అధ్యక్షత వహించారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా ఇండియా కమ్యూనిటీ, ఎపి జన్మభూమి కార్యాలయం ఈ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న ఎన్నారైలకు వీసాల పరంగా ఎటువంటి కష్టాలు వచ్చినా వెంకటరమణ వెంటనే స్పందించి సహాయపడుతున్నారని, అటువంటి మంచిమనిషికి వీడ్కోలు పలకడం కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ ఆయన సేవలను బే ఏరియాలోని ఎన్నారై కమ్యూనిటీ ఎప్పుడూ మరచిపోలేదన్నారు.

ఈ కార్యక్రమంలో బాటా తరపున విజయ ఆసూరి, తానా తరపున సతీష్‌ వేమూరి, ఇతర ప్రముఖులు పాల్గొని వెంకటరమణ సేవలను ప్రశంసించారు. రజనీకాంత్‌ కాకరాల, రామ్‌ తోట, ప్రసాద్‌ మంగిన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click here for Photogallery