ఎన్నారై టి.ఆర్.యస్ యుకె శాఖ ఆధ్వర్యంలో లండన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టి ఆర్ యస్ యుకె ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి  తెరాస కార్యకర్తలు,తెలంగాణ వాదులు మరియు ఇతర ప్రవాసులు హాజరయ్యారు.

ఎన్నారై టి.ఆర్.యస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉపాధ్యక్షులు అశోక్ దూసరి మాట్లాడుతూ కెసిఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా నిర్మించే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని ,ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలని వారంతా కోరుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని మరియు ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ కి కెసిఆర్, ఎంపీ కవిత మరియు యావత్ టి.ఆర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంధర్భంగా సెక్రటరీ సృజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ఈస్ట్ లండన్ ఇంచార్జ్ రమేష్ యెసంపల్లి మాట్లాడుతూ నేడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందనీ,ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు. ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల మాట్లాడుతూ ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో కెసిఆర్ వెంటే ఉంటామని, హాజరైన కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకల్లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సేరు సంజయ్ ,సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఈట్ సెక్రటరీ వినయ్ ఆకుల, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ రవి ప్రదీప్, వెస్ట్ లండన్ ఇంచార్జ్ బుడగం, మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని, అశోక్ కుమార్ అంతగిరి రాఘవేందర్, మహేందర్ రెడ్డి మరియు టాక్ సభ్యులు మట్టా రెడ్డి హాజరైన వారిలో వున్నారు.

Click here for Event Gallery