మాదాపూర్‌ శిల్పకళావేదికలో శనివారం రాత్రి అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) సాంస్కృతిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నటుడు కృష్ణకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. కృష్ణ, విజయనిర్మల దంపతులను ఘనంగా సత్కరించారు. నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి ఆటా, టాటా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మెజీషియన్‌ బీవీ పట్టాభిరాం, వైద్య నిపుణుడు సూర్యారావు, శాస్త్రవేత్త డా.జి.సతీష్‌రెడ్డిలకు ఎక్స్‌లెన్సీ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, సినీనటి రోజా, విజయనిర్మల, సినీ ప్రముఖులు అశ్వినీదత్‌, తమ్మారెడ్డి భరద్వాజ, ఆదిశేషగిరావు, ప్రభ, వీవీ ప్రసాద్‌, ఆటా ప్రస్తుత అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, తదుపరి అధ్యక్షుడు పరమేష్‌ భీమిరెడ్డి, టాటా అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, టాటా బోర్డు సభ్యుడు వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Click here for Event Gallery