MP Kavitha Felicitates Telugu Times Editor Chennuri Subba Row

తెలుగు ప్రపంచ మహాసభల్లో భాగంగా మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ఎన్నారైల సదస్సులో తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావుతోపాటు పలువురు ఎన్నారై ప్రముఖులను జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత సత్కరించారు. అమెరికాలో 14 సంవత్సరాలుగా తెలుగు పత్రిక 'తెలుగు టైమ్స్‌'ను నడపడంతోపాటు, అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పించేందుకు పాఠశాలను ఏర్పాటు చేసి మాతృభాష రక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి సుబ్బారావును మహాసభల నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహాసభల ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌బిగాల తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery