ప్రపంచ మహాసభల ఏర్పాట్లను చూసిన ఎన్నారైలు

15-12-2017

ప్రపంచ మహాసభల ఏర్పాట్లను చూసిన ఎన్నారైలు

హైదరాబాద్‌లో నేటి నుంచి జరుగుతున్న ప్రపంచ మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైలతో కలిసి మహాసభల ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌బిగాల గురువారం రాత్రి వేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. రవీంద్రభారతిలో ఉన్న మహాసభల కార్యాలయంలో సమావేశమై అక్కడ నుంచి ఎల్‌బిస్టేడియం వద్దకు వెళ్ళి ఏర్పాట్లను చూశారు. మహేష్‌బిగాలతోపాటు అమెరికాలో ప్రచురితమవుతున్న తెలుగు టైమ్స్‌ పత్రిక ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు, న్యూజెర్సికి చెందిన శ్రీనివాస్‌ గనగోని తదితరులు ఉన్నారు.

Click here for Photogallery