ప్రపంచ తెలుగు మహాసభలలో ఎన్నారైలు పాల్గొని విజయవంతం చేయండి

27-11-2017

ప్రపంచ తెలుగు మహాసభలలో ఎన్నారైలు పాల్గొని విజయవంతం చేయండి

ఆస్ట్రియా సన్నాహక సదస్సులో ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రవాస తెలుగు  సాహితీవేత్తలను, కవులను, మరియు సంగీత, నృత్య, జానపద కళాకారులకు అవగహన కలిపించి ఆహ్వానం పలకడంలో భాగంగా చివరి వారంలో వియన్నా లో నిర్వహించిన  సదస్సులో ప్రపంచ తెలుగు మహాసభల ప్రవాస సమన్వయ కర్త మహేష్ బిగాల ఆస్ట్రియా దేశంలోని వియన్నా లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లడరు. ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగు భాష గొప్పతనం మరియు దాని చరిత్ర స్మరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మునుపుఎన్నడు లేనివిదంగా కనివిని ఎరుగని రీతిలో చాల గొప్పగా నిర్వహించబోతున్నది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్నందున సీఎం కెసిఆర్ దీనిపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ రెడ్డి, సతీష్, రాజు, శ్రీకాంతు, వంశి తదితరులు పాల్గొన్నారు.