Pochampalli Silks Diamond Necklace to be Gifted to Ivanka Trump

హైదరాబాద్‌లో ఈ నెల 28న జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు హజరవనున్న ఇవాంక ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండు పోచంపల్లి పట్టుచీరలు, డైమండ్‌ నెక్లెస్‌ బహుకరించనున్నట్లు తెలిసింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి చేనేత కుర్తా, పైజామా బహుమానంగా ఇవ్వనున్నట్లు సమాచారం. సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు కూడా పోచంపల్లి వస్త్రాలు బహుకరించాలని, తద్వారా చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి, ప్రాచుర్యం వస్తుందని సర్కారు భావిస్తోంది. మూడు రోజులపాటు జరిగే సదస్సులో పాల్గొనే 200 మంది మహిళా వలంటీర్లు పోచంపల్లి కాటన్‌ మస్రస్‌ చీరలు ధరించనున్నారు. ఇందుకోసం పోచంపల్లిలో 200 టెస్కో రకం పట్టుచీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు.