డల్లాస్ లో తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

21-11-2017

డల్లాస్ లో తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

డల్లాస్ లో చేపట్టిన సన్నాహక సభకు సుమారు 150 మంది తెలుగు వారు హాజరు కాగా. అందరు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠమనగా చేపడుతున్న సన్నాహక సభల ముఖ్య ఆదేశాన్ని, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్త శుద్ధిని కొనియాడారు. ఈ ప్రపంచ మహా సభల తో తెలుగు భాష పునః వైభవం సంతరించుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు.  

శ్రీ గౌతమ్ కస్తూరి గారి అధ్యక్షతన డల్లాస్ లో జరిగిన సన్నాహక సభలో ముఖ్య అతిధులు శ్రీ చిట్టెంరాజు వంగూరి మరియు భాస్కర్ రాయవరం గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలుగు సభలను నిర్వహిస్తూ ప్రపంచానికి తెలుగు యొక్క గొప్ప తనాన్ని ఒక సందేశం రూపం లో పంపిస్తుంది అన్నారు. అతి ప్రాచీన భాషల్లో ఒక్కటైనా తెలుగు భాష కు ఈ సభలు ఒక అలంకారమని గౌరవమని కొనియాడారు. ప్రపంచ తెలుగు మహాసభలను అట్టహాసంగా కానీ విని ఎరుగని రీతిలో చేయాలనీ, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే  తెలంగాణ రాష్ట్ర పట్టుదలను ఆకాంక్షను చంద్ర కన్నెగంటి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, శారదా సింగిరెడ్డి, డాక్టర్ నరసింహరెడ్డి  ఉరిమింది కొనియాడారు.

ఈ సభను ఏర్పాటు చేసిన ముఖ్యులు శ్రీ మహేష్ ఆదిభట్ల, రఘు చిట్టిమల్ల, డాక్టర్ మోహన్ గోలి, శ్రీనివాస్ కొట్టే, దేవేందర్ చిక్కాల గారు డల్లాస్ లో సన్నాహక సభ ఏర్పాటు చేసినందుకు మహేష్ బిగాల గారికి కృతిగానతలు చెప్పారు. 

శ్రీనివాస్ సురభిగారు సభకు వచ్చిన అతిదులందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. డల్లాస్ లో సన్నాహక సభను ను నిర్వహించి డల్లాస్ తెలుగు వారందరిని ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించినందుకు శ్రీ మహేష్ బిగాల గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పాడు. ఈ సందర్బంగా సన్నాహక సభలు ప్రపంచ తెలుగు మహాసభలకు ఎంతో ముఖ్యమైనవి అని, ఈ సభలను మీడియా లో కవర్ చేస్తూ యావత్ ప్రపంచానికి ఈ విషయాలు అందచేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియచేసారు.