ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎన్నారై కమిటీ కోఆర్డినేటర్‌ గా మహేష్‌ బిగాల

08-11-2017

ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎన్నారై కమిటీ కోఆర్డినేటర్‌ గా మహేష్‌ బిగాల

డిసెంబర్‌ 15 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల కోసం వివిధ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నారై కమిటీ కోఆర్డినేటర్‌గా నిజామాబాద్‌కు చెందిన మహేష్‌ బిగాలను నియమించింది. అమెరికాలోనూ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రముఖులను, సాహితీవేత్తలను ఈ కమిటీ ఆహ్వానించింది. అదే విధంగా ఎన్నారైలు ప్రసంగించేందుకు వీలుగా తెలుగు మహాసభల్లో ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నది.