Mountain House Tracy Telugu Association Deepavali Celebrations

ఉత్తర కాలిఫోర్నియాలోని మౌంటెన్‌ హౌస్‌ ట్రేసీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ఎమ్‌హెచ్‌సీఎస్‌డీ బోర్డు ప్రెసిడెంట్‌ బ్రెయిన్‌ లూసిడ్‌, ఎమ్‌హెచ్‌సీ బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌ బెర్నిస్‌ ట్రయాంగిల్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  కార్యక్రమంలో మౌంటెన్‌ హౌస్‌లోని భారతీయులందరూ సంప్రదాయ దస్తుల్లో ఆడి పాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కవృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శివపార్వతి అనంతు దర్శకత్వంలో సుమారు 30 మంది చిన్నారులు దీపావళి ప్రాముఖ్యాన్ని నరకాసుర వధ నాటక రూపంలో ప్రదర్శించారు. పండగ సందర్భంగా  అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎమ్‌టీటీఏం సంఘం కార్యనిర్వాహకులు అతిథులను ఘనంగా సత్కరించి  కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.