CM Chandrababu Meet with IT Companies in Chicago

అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని బృందం ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. దీనికి 80కిపైగా ఐటీ సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. ఐటీ సిటీపై ఐటీ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి చంద్రబాబునాయుడుకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విశాఖను మెగా ఐటీ సిటీగా, అమరావతిని మేజర్‌ ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు చేశారు. ఏపీలో సంస్థల ఏర్పాటునకు 450మంది ప్రవాస భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు బృందం తెలిపింది.