TAGC Batukamma and Dusshera Celebrations 2017

చికాగో మహా నగర తెలుగు సంస్థ ( ఉత్తర అమెరికా లో మొదటి తెలుగు సంఘం) బతుకమ్మ / దసరా వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ, అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ మద్దతుతో భారీ స్థాయిలో నిర్వహించారు.

సెప్టెంబర్‌ 24, 2017 నాడు ఎస్‌విఎస్‌ బాలాజీ టెంపుల్‌ అరోరా లోని పంచవటి కళాప్రాంగణములో వెయ్యికిపైగా అతిథులతో బతుకమ్మ దసరా వేడుకలను చాలా  ఘనంగా జరుపుకున్నారు. టీజీఎసీ కార్యవర్గము, జాతీయ సంస్థల సహకారంతో టీఏజీసీ పతాకం కింద గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, గత ఏడాది, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగలో తమ మొదటి అంతర్జాతీయ సంఘంగా టీఏజీసికి మద్దతును ప్రకటించిందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన సంప్రదాయ  గుర్తింపు తెచ్చేందుకు టీఎజీసీ 2018 అధ్యక్షురాలు జ్యోతి చింతలపాటి, మహిళా బోర్డు డైరెక్టర్లు చొరవ తీసుకుని పోచంపల్లి పట్టు చీరలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుని, సంస్థ ఆడపడుచులను సంప్రదించి వారి సలహాలు మరియు ఆమోదంతో విక్రయించారు.  ప్రపంచంలోని అన్ని బతుకమ్మ ఉత్సవాల్లో విభిన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధముగా రికార్డు స్థాయిలో 125 మంది మహిళలు విక్రయించిన చీరలు ధరించి 2017 టీఏజీసీ బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక వన్నెను తెచ్చారు. ఈ విధంగా పోచంపల్లిలో నమ్రతతో పనిచేసేవారికి మద్దతు ఇవ్వడానికి మరియు చేనేత మరియు మగ్గ రంగాలపై ఆధారపడిన కార్మికులకు సహాయం చేశారు.  

టీఏజీసి అంలకరణ కమిటి చైర్‌ శ్వేతా జనమంచి నాయకత్వంలో వాలంటీర్ల సహాయముతో పంచవటి కళాప్రాంగణాన్ని మరియు బతుకమ్మలను చక్కని రంగురంగుల పుష్పాలతో మరియు పట్టువత్రాలతో అలంకరించారు.  టీఏజీసీ మహిళా వాలంటీర్లు 54 అంగుళాలు ఎత్తు టీఏజీసి బతుమక్మ తయారు చేయడానికి న్యూజెర్సీ నుండి పూలను తెప్పించి పద్దతిలో అమర్చారు. ఈ  కార్యక్రమం ప్రారంభానికి ముందుగా దేవాలయములో పార్వతి దేవికి పసుపు కుంకం, ముక్కు పుడక మరియు పుష్పాలను సమర్పించారు. టీఏజీసి బతుకమ్మ కమిటీ చైర్‌ మమతా లంకాల మరియు టీఏజీసి అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే అతిథులను స్వాగతిస్తూ పండుగ విశిష్టతను క్లుప్తముంగా వివరించారు.

బతుకమ్మ ఆటను అమ్మవారి ప్రార్థన గీతంతో ప్రారంభమై 5:30 పీఎం వరకు బతుకమ్మ ఆట పాట పంచవటి కళా ప్రాంగణములో కొనసాగింది. సుపరిచిత జానపద గాయకురాలు షాలిని గారిన భారతదేశంలో నుండి పాడటం మరియు స్త్రీలని ప్రోత్సహించడానికి సంస్థ పిలిపించారు. ఈ కార్యక్రమం ముగిసే వరకు శక్తి మరియ అభిరుచితో మహిళలు బతుకమ్మ ఆట పాటలతో కొనసాగించి ప్రపంచానికి మా సంస్కృతి మరియు సంప్రదాయాన్ని మరిచిపోలేదని నిరూపించారు. బాలికలు పాల్గొనడం కాకుడా వారి పాత్ర ఈ ఈవెంట్లో  ప్రత్యేక ఆకర్షణ.

బతుకమ్మ సాగనంపే కార్యక్రమాన్ని ప్రత్యక్ష సాంప్రదాయ సన్నాయి మరియు సంగీత వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్ళి టీఎజీసి పురుష వాలంటీర్ల సహాయంతో ఆలయ ప్రాంగణ కొలనులో నిమజ్జనం చేశారు.

బతుకమ్మ వేడుకలలో సాంప్రదాయ మరియు విశిష్టతమైన బతుకమ్మ పోటీలను నిర్వహించి, గెలుపొందిన మహిళలకు బతుకమ్మ వేడుకల చైర్‌ మమతా లంకల మరియు కార్యవర్గ సభ్యులతో టీఏజీసి అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే బహుమతులు అందజేశారు.

టీఏజీసి పుడ్‌ కమిటీ చైర్‌ ఉమా అవదూత నాయత్వంలో తెలంగాణ సాంప్రదాయ అరిసెలు ఇక్కడే తయారు చేసి మరియు తెలంగాణ నుండి సకినాలను తెప్పించి ఈవెంట్‌ వద్ద అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను మొన్నటి వరద బాధితుల సహాయార్థం నిధులను ఇవ్వాలని సేకరించారు. సేవా కమిటి చైర్‌ వాణి ఏట్రింతల స్వచ్ఛంద సేవలకుల సహాయంలో  స్నాక్స్‌ అమ్మడం కీలక పాత్ర పోషించింది.

బతుకమ్మలను సాగనంపినా తరువాత, అన్ని కుటుంబాలు టీఏజీసి నిర్వహించిన జమ్మి పూజలో పాల్గొన్నారు. బాలాజీ ఆలయ పూజారి శ్రీ హనుమాన్‌ ప్రసాద్‌ పూజ అనంతరము భక్తులందరికీ పూజలో కంకణాలను బట్టి జమ్మి ఆకు మరియు ఆక్షింతలు ఇచ్చారు. అన్ని కుటుంబాలు జమ్మీని పంచుకోవడం మరియు పెద్దల నుండి అతిధుల నుండి దీనెనను తీసుకున్నారు.


Click here for Event Gallery