అమెరికాలో ఎక్కువ వేతనాలిస్తున్న ఉద్యోగాలివే!

02-09-2017

అమెరికాలో ఎక్కువ వేతనాలిస్తున్న ఉద్యోగాలివే!

2001తో పోలిస్తే అమెరికాలో నిరుద్యోగిత రేటు తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ అతిఎక్కువ వేతనాలిస్తున్న ఉద్యోగాల నుంచి ఎంప్లాయ్మెంట్‌ సోషల్‌ నెట్వర్క్‌ లింక్డిన్‌ సర్వే చేసింది. 20 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సర్వే చేసిన లింక్డిన్‌ అధిక వేతనాలిస్తున్న ఉద్యోగాల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో 4,50,000 డాలర్ల మధ్యగత వేతనంతో ఆర్థోపెడిక్‌ సర్జన్‌ ఉద్యోగం మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కార్డియాలజిస్టు, రేడియోలజిస్ట్‌, ప్లాస్టిక్‌ సర్జన్‌, అనస్థీషియాలజిస్ట్‌ ఉద్యోగాలు భారీ వేతనాన్ని అందిస్తున్నాయి. ఇక అత్యధిక వేతనాన్ని అందిస్తున్న రంగాల జాబితాలో 1,04,700 డాలర్ల మధ్యగత వేతనాన్ని అందజేస్తూ సాఫ్ట్వేర్‌, ఐటీ సేవల రంగం మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో హార్డ్వేర్‌ అండ్‌ నెట్వర్కింగ్‌ రంగం, తయారీ రంగం, ఆరోగ్య రంగం, ఆర్థిక రంగం, వినియోగదారుల వస్తువులు రంగం వంటివి వున్నాయి. భౌగోళికంగా చూస్తే శ్రాన్ఫిన్సిస్కో అతిఎక్కువ సరాసరి వేతనాలను అందజేస్తున్న వాణిజ్య ప్రాంతాల్లో మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో సియోటెల్‌, వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, బోస్టన్లు నిలిచాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న అధిక జీవన వ్యయం కారణంగా ఇక్కడి కంపెనీలు అత్యధిక వేతనాన్ని ఆఫర్‌ చేస్తున్నాయని లింక్డిన్‌ పేర్కొంది.