Houston Texas flood disaster

అమెరికన్లకు కొత్త కష్టం వచ్చి పడింది. హ్యూస్టన్‌ ప్రాంతాన్ని భారీ వర్షాలు ఆపై వరదలు ముంచెత్తుగా, దేశ వ్యాప్తంగా వంట గ్యాస్‌ కొరత ఏర్పడింది. అమెరికన్‌ ప్రజలకు అందించే వంట గ్యాస్‌ లో మూడో వంతు హ్యూస్టన్‌ నుంచే అందుతుంది. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా అక్కడ ఉత్పత్తి, సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నిల్వవున్న గ్యాస్‌ పూర్తయిపోగా, హ్యూస్టన్‌ పరిసరాల్లో ఇప్పటికే వాహనాలకు, ఇళ్లకు గ్యాస్‌ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం వాషింగ్టన్‌, న్యూయార్క్‌, కాలిఫోర్నియా తదితర నగరాలపైనా పడినట్లు సమాచారం. చాలా చోట్ల వంట గ్యాస్‌ కొరత ఏర్పడగా, పరిస్థితి చక్కబడేందుకు మరో వారం రోజుల వరకూ పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.