న్యూయార్క్‌లో భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్‌ఐ త్రివర్ణపతకాలు రెపరెపలాడాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకునిన ప్రతి ఏటా నిర్వహించే ఇండియాపెరేడ్‌లో భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. న్యూయార్క్‌ నగర వీధులు జైహింద్‌ నినాదాలతో మారుమోగాయి. కాగా బాహుబలి ఫేమ్‌ రానా, తమన్నా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇండియన్‌ ఆర్మీ రిటైర్డ్‌ అధికారి జనరల్‌ దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇండియన్‌ మ్యాథమెటిషియన్‌ ప్రొఫెసర్‌ ఆనంద్‌కుమార్‌, కెప్టెన్‌ క్షంతా బాజ్‌పాయి, సునీత నరుల, ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో విజేతగా నిలిచిన రేవంత్‌, ఖుదాబక్ష్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.